Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 May 2022 09:16 IST

1.  రాష్ట్రానికేదీ హైస్పీడ్‌

దేశంలోని పలు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్లు నిర్మించే కసరత్తు సాగుతుంటే.. మన రాష్ట్రానికి అందులో చోటు లభించడం లేదు. 5 కోట్ల జనాభా, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి ముఖ్యమైన నగరాలు, వివిధ వ్యవసాయ, వాణిజ్య కేంద్రాలు, 5 నౌకాశ్రయాలు ఉన్న రాష్ట్రాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండి, నిత్యం ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే కీలక మార్గాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ వీటిని రైల్వేశాఖ పరిగణనలోకి తీసుకోవడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Digital Rape: మైనర్‌పై 80ఏళ్ల వృద్ధుడి ‘డిజిటల్‌ రేప్‌’

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో డిజిటల్‌ రేప్‌ కేసు వెలుగుచూసింది. 80 ఏళ్ల వృద్ధుడు తనను 7 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడు మౌరిస్‌ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మౌరిస్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అలహాబాద్‌కు చెందిన ఇతడు నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను పెట్టుకున్నారు. ఏడేళ్లుగా ఆమె ఇక్కడే పనిచేస్తోంది. మౌరిస్‌ రైడర్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఏయ్‌ ఎస్‌ఐ.. ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది?

తనకు అన్యాయం జరిగిందని గోడు వెళ్లబోసుకునేందుకు వేదిక వద్దకు వచ్చిన ఓ రైతును పోలీసులు నిలువరించలేదని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏయ్‌ ఎస్‌ఐ... ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది’ అంటూ మండిపడ్డారు. రైతు భరోసా 4వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో వ్యవసాయశాఖ అధికారులు సోమవారం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది!: మంత్రి సురేష్‌

4. Playoffs: ఇంకా మూడు బెర్తులు.. ఏడు జట్లు పోటీ

టీ20లీగ్‌ దశ చివరికొచ్చేసింది. ఇక మిగిలిన లీగ్‌ మ్యాచ్‌లు ఆరు మాత్రమే. అయితే ముంబయి, చెన్నై ఎప్పుడో రేసు నుంచి తప్పుకోగా.. ప్రస్తుతానికి అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్నది గుజరాత్‌ మాత్రమే. మరో మ్యాచ్‌ మిగిలుండగానే పది విజయాలు సాధించిన ఆ జట్టు అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించబోతోంది. ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్న రాజస్థాన్‌, లఖ్‌నవూ తలో 8 విజయాలతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. వాటి నెట్‌రన్‌ రేట్‌ (రాజస్థాన్‌ +0.304, లఖ్‌నవూ +0.262).. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 8 ఏళ్లు.. 30 కొనుగోళ్లు

ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు తన సామ్రాజ్య విస్తరణకు సంస్థల ‘కొనుగోళ్ల’నే ప్రధాన మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 2014 నుంచి వివిధ రంగాల్లో 30కి పైగా సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా, ప్రముఖ స్థానం పొందడమే ఇందుకు నిదర్శనం. ఈ విధంగానే అత్యంత కీలకమైన విమానాశ్రయాలు, ఇంధనం, నౌకాశ్రయాలు, సిమెంటు రంగాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అదానీ గ్రూపు ఎదిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. NCTE: బీఈడీ, డీఈడీ కాలేజీలకు షాక్‌

బీఈడీ, డీఈడీతోపాటు వ్యాయామ విద్య కోర్సులను అందించే ఉపాధ్యాయ విద్య కళాశాలలకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) గట్టి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం(2022-23)లో ప్రవేశాలు చేపట్టకూడదని నిర్ణయించింది. దేశంలో దాదాపు 17 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో ఉపాధ్యాయ విద్యా కోర్సులను అందించే కళాశాలలున్నాయి. ఈ నిర్ణయం అమలైతే వాటిలో మూడో వంతు విద్యాసంస్థల్లో ప్రవేశాలు ఉండవు(‘జీరో ఇయర్‌’). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వయసు వెనక్కి!

వయసు మీద పడటం అనివార్యమే కావచ్చు. మరి ఎంత బాగా వృద్ధాప్యం వస్తోందో ఎప్పుడైనా గమనించారా? ముసలితనం ముంచుకురావటంలో బాగోగులేంటని ఆశ్చర్యపోకండి. మనమంతా పైకి చెప్పుకునే వయసు, శరీరంలో కొనసాగే వయసు వేరు మరి. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు తెల్లబడటం, చర్మం ముడతల వంటి వృద్ధాప్య ఛాయలు తెలుస్తూనే ఉంటాయి. కానీ ఏదైనా అనుకోని సమస్య బయటపడేంతవరకూ లోపల తలెత్తే మార్పుల గురించి తెలియనే తెలియదు. కాబట్టే వైద్యశాస్త్రం వృద్ధాప్య ప్రక్రియను అర్థం చేసుకోవటం, దీన్ని జయించటంపై దృష్టి సారించింది. ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రూ.16 లక్షలు కట్టాల్సిందే

8. ‘బ్యాంకు క్యాషియర్‌’ కేసులో ఊహించని మలుపు!

బ్యాంకు సొమ్ము అపహరించి అదృశ్యమైన క్యాషియర్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. వారం రోజులుగా అదృశ్యమైన నిందితుడు హయత్‌నగర్‌ న్యాయస్థానంలో సోమవారం లొంగిపోయాడు. ఈ నెల 10న వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.23.53లక్షల నగదుతో క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాయమయ్యాడు. ఆన్‌లైన్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటైన తాను నష్టపోయానంటూ తల్లికి వీడియో సందేశం పంపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ పతక పంచ్‌

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ వేదికపై అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకుంది. బాక్సింగ్‌లో అత్యున్నత టోర్నీ అయిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరడం ద్వారా ఆమె పతకం ఖరారు చేసుకుంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ప్రపంచ ఛాంపియన్‌ అవుతుంది. జూనియర్‌ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచ ఛాంపియన్‌ కూడా అయిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. BSF: బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ పోస్టులు

దేశ రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే యువత కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) మొత్తం 90 గ్రూప్‌ ‘బి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇది చక్కటి అవకాశం. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. 30 ఏళ్ల వయసు మించని యువతీయువకులను బీఎస్‌ఎఫ్‌ ఆహ్వానిస్తోంది. ఇటీవలే కమాండెంట్‌ కొలువులకు నోటిఫికేషన్‌ రాగా... తాజాగా గ్రూప్‌ బి పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌) - 1, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌) - 57, జూనియర్‌ ఇంజినీర్‌/సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) - 32 ఖాళీలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని