Mulugu: ములుగు జిల్లాలో అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులు

ములుగు జిల్లాలో దాదాపు 84 మంది పర్యాటకులు అడవిలో చిక్కుకున్నారు. పర్యాటకులను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Updated : 26 Jul 2023 23:38 IST

వెంకటాపురం: ములుగు జిల్లాలో దాదాపు 84 మంది పర్యాటకులు అడవిలో చిక్కుకున్నారు. బుధవారం ఉదయం జిల్లాలోని వెంకటాపురం పరిధిలో ఉన్న ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు సాయంత్రం తిరిగి వస్తుండగా మార్గమధ్యలో భారీ వర్షాలకు వాగు ఉప్పొంగింది. దీంతో 60 మంది పర్యాటకులు అడవిలోనే ఉండిపోయారు. డయల్‌ 100కు పర్యాటకులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

అడవిలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడతాం.. ములుగు ఎస్పీ

అడవిలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడతామని మలుగు ఎస్పీ గౌష్‌ ఆలం అన్నారు. పర్యాటకులను కాపాడేందుకు డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన చెప్పారు. పర్యాటకులతో ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు. వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని వారిని హెచ్చరించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. రెస్క్యూ బృందాలు వారిని కాపాడతాయని ఎస్పీ తెలిపారు. వారి కోసం ఆహార పదార్థాలు, రక్షణ పరికరాలను పంపిస్తున్నామని ఎస్పీ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని