Electric bikes: కుషాయిగూడలో పేలిన రెండు ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీలు.. భారీగా ఎగసిన మంటలు

ఛార్జింగ్‌ పెట్టిన రెండు ఎలక్ట్రిక్‌ బైకు బ్యాటరీలు పేలిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కుషాయిగూడలోని

Updated : 16 Aug 2022 06:56 IST

కాప్రా: ఛార్జింగ్‌ పెట్టిన రెండు ఎలక్ట్రిక్‌ బైకు బ్యాటరీలు పేలిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కుషాయిగూడలోని సాయినగర్‌కు చెందిన టి.హరిబాబు అనే వ్యక్తి ఇటీవలే రెండు ఎలక్ట్రిక్‌ బైక్‌లను కొనుగోలు చేశారు. సోమవారం నాలుగు గంటల సమయంలో రెండు బైక్‌లకు ఇంటి బయట ఛార్జింగ్‌ పెట్టారు. గంట తర్వాత భారీ శబ్ధం రావడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి చూసేసరికి బ్యాటరీలు పేలి బైక్‌లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అవి పూర్తిగా దగ్ధమైయ్యాయి. పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలకు మంటలు అంటుకోగా.. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. బ్యాటరీలు పేలిన సమయంలో ఇంటి బయట ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని