Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్‌ సలహా

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ ‘క్యూనెట్‌’కు టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారంపై ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

Published : 30 Jan 2023 01:17 IST

హైదరాబాద్‌: మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ ‘క్యూనెట్‌’కు టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్‌ చేయడం కానీ, సపోర్టు చేయడం కానీ చేయవద్దని సలహా ఇచ్చారు. క్యూనెట్‌ లాంటి మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ట్వీట్‌ చేశారు. సజ్జనార్‌ గతంలో హైదరాబాద్‌ సీపీగా ఉన్న సమయంలో క్యూనెట్‌ సహా పలు మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని