పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది: వెంకయ్యనాయుడు

ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 26 Jan 2024 13:59 IST

హైదరాబాద్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపి.. సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్రపంచం మరోసారి భారత్‌ వైపు చూస్తోంది. అందరూ ఐక్యంగా ముందుకు సాగి దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసేందుకు పాటుపడాలి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో ముందుకుపోతోంది. నాకు ‘పద్మవిభూషణ్’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని