Viveka Murder Case: వివేకా హత్యకేసు.. దస్తగిరి పిటిషన్‌పై 29న తీర్పు

వివేకా హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

Published : 12 Apr 2024 17:26 IST

హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. కోర్టుకు శుక్రవారం హాజరుపై ఎంపీ అవినాష్‌ రెడ్డి, దస్తగిరి మినహాయింపు తీసుకున్నారు. ఈ కేసులో మిగతా నిందితులు హాజరయ్యారు. దస్తగిరిని సాక్షిగా పరగిణించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. వాదనలు ముగించిన న్యాయస్థానం తీర్పును ఈనెల 29కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని