vontimitta: కన్నుల పండువగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం

ఆంధ్రుల భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. పిండారబోసినట్లనిపించే వెన్నెల కాంతిలో..

Updated : 15 Apr 2022 22:23 IST

ఒంటిమిట్ట: ఆంధ్రుల భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. పిండారబోసినట్లనిపించే వెన్నెల కాంతిలో తిరుమల నుంచి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి దంపతులు స్వామివారికి కానుకలు సమర్పించారు. మూలమూర్తికి ఒక కిరీటం, ఉత్సవమూర్తులకు 3 కిరీటాలు అందజేశారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు పంపించారు. విద్యుత్తు దీపాల వెలుగుల్లో రాములోరి సన్నిధి దేదీప్యమానంగా ప్రకాశించింది. కొత్తగా నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికపై  తొలిసారిగా స్వామివారి కల్యాణం జరిపించారు. వివిధ సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఒంటిమిట్ట జనసంద్రంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని