Bronchitis: ఎడతెరపి లేకుండా దగ్గు వేధిస్తుందా..? యోగా చేసి చూడండి

ఎంతకీ వదలని జలుబు, ఎడతెరపి లేని దగ్గు ఊపిరి తీసుకోనివ్వవు. రాత్రయితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. నిద్ర కూడా పోలేని పరిస్థితి నెలకొంటుంది. వాతావరణంలో మార్పులు, గొంతు ఇన్‌ఫెక్షన్లతో దగ్గు మరింత వేధిస్తుంది. పిల్లలకు జలుబు, దగ్గు తొందరగా సోకుతుంది. ఈ సమస్యను బ్రాంకైటీస్‌గా పిలుస్తారు.

Updated : 25 Mar 2023 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతకీ వదలని జలుబు, ఎడతెరపి లేని దగ్గు ఊపిరి తీసుకోనివ్వవు. రాత్రయితే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. నిద్ర కూడా పోలేని పరిస్థితి నెలకొంటుంది. వాతావరణంలో మార్పులు, గొంతు ఇన్‌ఫెక్షన్లతో దగ్గు మరింత వేధిస్తుంది. పిల్లలకు జలుబు, దగ్గు తొందరగా సోకుతుంది. ఈ సమస్యను బ్రాంకైటీస్‌గా పిలుస్తారు. దీన్ని మందులతో కన్నా యోగాతో తొందరగా పాలదోలవచ్చని యోగా నిపుణులు ఆర్‌.ఆర్‌.ప్రసాద్‌ చెబుతున్నారు. 

ఏం చేస్తే మంచిదంటే..!

జలుబు, దగ్గును తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు బాగా పని చేస్తాయి. శ్వాసకోశనాళం ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడంతో దగ్గు అసలే వదలదు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. వీరు అర్థ ఉస్ట్రాసనం, భుజంగాసనం, లింగముద్ర చేస్తే సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇలా ప్రతి రోజు ఐదుసార్లు ఉదయం, సాయంత్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని