Vaccination: కోటి మంది టీనేజర్లకు రెండు డోసులూ పూర్తి

వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి చేరుకుంది. జనవరి 3 నుంచి టీనేజర్లకు ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో...

Published : 09 Feb 2022 18:36 IST

దిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి చేరుకుంది. జనవరి 3 నుంచి టీనేజర్లకు ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా కోటి మందికి రెండు డోసులూ అందించింది. ఇప్పటివరకు కోటి మందికి పైగా టీనేజర్లకు వ్యాక్సిన్‌ రెండు డోసులూ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ వెల్లడించారు. 15 -18 ఏళ్ల వయసు కలిగిన వారిలో 5.04 కోట్ల మందికి తొలి డోసు అందించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు, గడిచిన 24గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా అర్హులైనవారందరికీ 53.61లక్షల డోసులు పంపిణీ చేశారు. ఈరోజు ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా 170.87 కోట్ల డోసులు పంపిణీ పూర్తయింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం 2021-22 నాటికి దేశ వ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసువారు 7.4కోట్ల మంది ఉన్నట్టు అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని