క్వారంటైన్‌లో 361 మంది ప్రయాణికులు..

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ బయటపడిన నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిని  క్వారంటైన్‌లో పెడుతున్నారు.  ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 664 మంది ప్రయాణికులు రాగా, వీరిలో 361 మందిని నిర్బంధంలో ఉంచినట్లు  పౌర విమానయాన అధికారి చెప్పారు. ‘మంగళవారం మొత్తంగా 9 అంతర్జాతీయ విమానాలు సిటీలో ల్యాండ్‌ అయ్యాయి...

Published : 30 Dec 2020 19:18 IST

 ముంబయి: బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ బయటపడిన నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిని  క్వారంటైన్‌లో పెడుతున్నారు.  ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 664 మంది ప్రయాణికులు రాగా, వీరిలో 361 మందిని నిర్బంధంలో ఉంచినట్లు  పౌర విమానయాన అధికారి చెప్పారు. ‘మంగళవారం మొత్తంగా 9 అంతర్జాతీయ విమానాలు సిటీలో ల్యాండ్‌ అయ్యాయి. ఈ విమానాల్లో వచ్చిన వారిని పరిశీలించిన అనంతరం 254 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతినిచ్చాం. గర్భిణిలు, వృద్ధులకు క్వారంటైన్‌ విధించలేదు’ అని అధికారి తెలిపారు.  
 
  కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశ పౌర విమానయాన శాఖ కొన్ని ప్రామాణికాలను సవరించింది. ఈ క్రమంలో యూకే , మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది.  ఈ నియమాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా  ఏడురోజులు సాధారణ క్వారంటైన్‌,  మరో ఏడు రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని