బాగ్దాద్‌ కాల్పుల్లో 11 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అక్కడి ఆర్మీ చెక్‌ పోస్టుపై గుర్తుతెలియని సాయుధ దుండగులు దాడీ జరిపారు.

Published : 09 Nov 2020 18:57 IST

సైనిక స్థావరంలో ఆయుధాలతో దాడీ

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఓ ఆర్మీ చెక్‌ పోస్టుపై గుర్తుతెలియని సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11మంది మృత్యువాతపడగా మరికొందరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఇరాక్‌ సైనికులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని నగరానికి దగ్గరలో ఉన్న ఆల్‌ రాధ్వానియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఆర్మీ చెక్‌పోస్టుపై నాలుగు వాహనాల్లో వచ్చిన కొందరు దుండగులు గ్రనేడ్లు, ఆధునిక ఆయుధాలతో ఒక్కసారిగా దాడికి దిగారు. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని ఇరాక్‌ మిలటరీ వెల్లడించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇరాన్‌ ఆర్మీ, పోలీసు బలగాలు దుండగుల కోసం వేట కొనసాగించాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని