వ్యాక్సిన్‌ తయారీలో ఇరాన్‌ మరో ముందడుగు

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఇరాన్‌ మరో ముందడుగేసింది. ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ స్వతంత్రంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రి క్లినకల్‌ ట్రయల్స్‌ను  విజయంతంగా పూర్తి చేసుకుంది. దీనిని ఇటీవల జంతువులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో మనుషులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా...

Published : 13 Sep 2020 13:57 IST

టెహ్రాన్‌: కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఇరాన్‌ మరో ముందడుగేసింది. ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ స్వతంత్రంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రి క్లినకల్‌ ట్రయల్స్‌ను విజయంతంగా పూర్తి చేసుకుంది. దీనిని ఇటీవల జంతువులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో మనుషులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మూడు దశల్లో ఈ ప్రయోగాలను జరపనున్నారు.

ఇప్పటి వరకు అధికారికంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి  రానందున ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇరాన్‌ ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని,  మాస్కులు తప్పని సరిగా ధరించాలని స్పష్టం చేసింది. త్వరలోనే క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌  డీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రష్యా దేశీయంగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. అయితే కేవలం రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే పూర్తయ్యాయి. మూడో దశ ప్రయోగాలు భారత్‌లో చేపట్టాలని రష్యా భావిస్తోంది. ఈ మేరకు ఇక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఇరాన్‌లో ఇప్పటి వరకు 3,44,940 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 23,029 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని