ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఉండొద్దు: కేంద్రం

కరోనా రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖ ........

Updated : 18 Sep 2020 22:40 IST

దిల్లీ: కరోనా రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆక్సిజన్‌ సరఫరాలో లోపాలు, కొరత లేకుండా చూడాలని కోరారు. ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే అంశంలో ఆంక్షలు ఉండరాదని, వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాల్లో స్థానికంగా సరఫరా చేసేందుకు అన్ని అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా సంస్థలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రాల మధ్య సరఫరాలో కూడా ఆంక్షలు వర్తించవన్నారు. పలు నగరాల మధ్య జరిగే ఆక్సిజన్‌ సరఫరాలో కూడా ఎలాంటి కాలపరిమితిలేదని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని