నిలకడగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Published : 21 Aug 2020 12:17 IST

దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నాయి. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రక్తప్రసరణ సవ్యంగానే ఉందని, ఆయన‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ఆర్మీ ఆసుపత్రి పేర్కొంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కొవిడ్‌ వైరస్‌ సోకినట్లు తేలిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని