భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్!

భారత్‌లో జనవరి 2021కి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభయ్యే అవకాశం ఉందని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు.

Published : 13 Dec 2020 01:39 IST

దిల్లీ: భారత్‌లో జనవరి 2021కి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభయ్యే అవకాశం ఉందని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. డిసెంబర్ చివరి నాటికి టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభిస్తుందని భావిస్తున్న తరుణంలో..ఒక బిజినెస్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి జీవితం సాధారణ స్థితికి చేరనుందని, అప్పటికి తగినన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

‘ఈ నెల చివరినాటికి మేం అత్యవసర లైసెన్స్ పొందే అవకాశం ఉంది. కానీ విస్తృత వినియోగం కోసం మాత్రం తరవాతి రోజుల్లో అనుమతి లభించవచ్చు. నియంత్రణ సంస్థలు అనుమతి ఇస్తే, 2021 జనవరి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని అదర్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి తగినన్ని టీకాలు తయారు చేయడానికి సీరమ్ సంస్థ సిద్ధమవుతోంది. పుణె కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

ఇవీ చదవండి:

మహమ్మారులకు టీకాల చెక్

ఫైజర్ టీకా వినియోగానికి అమెరికా అనుమతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని