Indian Railway: ఒక్క రైల్వే డివిజన్‌.. 6 నెలల్లో  ₹12 కోట్లు ఫైన్‌ వసూలు!

హరియాణాలోని అంబాలా రైల్వే డివిజన్‌ అధికారులు ఆరు నెలల కాలంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికుల నుంచి జరిమానాగా రూ.12కోట్లకుపైగా రాబట్టారు. గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య 2.15లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించారని, 3,805 మంది తమ లగేజ్‌కు బుకింగ్‌ చేసుకోలేదని అంబాలా

Published : 16 Oct 2021 21:57 IST

ఛండీగఢ్‌: హరియాణాలోని అంబాలా రైల్వే డివిజన్‌ అధికారులు ఆరు నెలల కాలంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికుల నుంచి జరిమానాగా రూ.12కోట్లకుపైగా రాబట్టారు. గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య 2.15లక్షల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించారని, 3,805 మంది తమ లగేజ్‌కు బుకింగ్‌ చేసుకోలేదని అంబాలా రైల్వే డివిజన్‌ అధికారులు వెల్లడించారు. 2,365 మంది మాస్క్‌ ధరించకుండా.. మరో 1,353 మంది బహిరంగ ప్రాంతంలో ధూమపానం చేస్తూ పట్టుబడినట్టు తెలిపారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి మొత్తంగా రూ.12.40కోట్లు జరిమానాగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ ప్రయాణికులు న్యాయబద్ధంగా టికెట్‌ బుక్‌ చేసుకొని ప్రయాణిస్తున్నారో లేదో పరిశీలించడానికి 70 మంది రైల్వే సిబ్బందితో చెకింగ్‌ డ్రైవ్స్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని