అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ ఉద్దేశపూర్వకంగానే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

Updated : 24 Sep 2023 12:41 IST

దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని దిల్లీ పోలీసులు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు తెలిపారు. అలాగే, మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్‌ భూషణ్‌కు క్లీన్‌చీట్‌ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. ఈ మేరకు దిల్లీ పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు.

ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్‌ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్‌ భూషణ్‌ తన గదికి పిలిచి గట్టిగా కౌగలించుకున్నాడని, ఆమె ప్రతిఘటించడంతో.. ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేసినట్లు తన చర్యను బ్రిజ్‌ భూషణ్‌ సమర్థించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో అనుమతి లేకుండా తన చొక్కాను పైకెత్తి అసభ్యంగా ప్రవర్తించాడని మరో మహిళా రెజ్లర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారని.. ఈ రెండు ఘటనలు బ్రిజ్‌ భూషణ్‌ తాను చేస్తున్న చర్యలపట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. 

‘సింగం’ లాంటి పోలీసు చిత్రాలు ప్రమాదకరం: బాంబే హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

కొద్ది నెలల క్రితం బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మైనర్‌ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌పై మిగిలిన మహిళ రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన దిల్లీ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు కోర్టుకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని