‘సింగం’ లాంటి పోలీసు చిత్రాలు ప్రమాదకరం: బాంబే హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు.

Published : 24 Sep 2023 09:20 IST

ముంబయి: న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయన్నారు. ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు. ‘కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు. అత్యాచార కేసుల్లోని నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు న్యాయం జరిగిందని వారు భావిస్తారు. కానీ న్యాయం జరిగిందా..?’ అని ప్రశ్నించారు. ‘సింగం చిత్రం క్లైమాక్స్‌లో పోలీసులందరూ విలన్‌ పాత్రగా చిత్రీకరించిన రాజకీయ నేతపై తిరగబడతారు. దాంతో అక్కడ న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే సూత్రమే అందుకు కారణం’’ అని జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు