Bipin Rawat: రావత్‌కు 17 తుపాకుల వందనం..  అంత్యక్రియల్లో 800మంది సర్వీస్‌ సిబ్బంది

హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి. ప్రస్తుతం సైనిక సిబ్బంది సందర్శనార్థం

Updated : 10 Dec 2021 14:01 IST

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి. ప్రస్తుతం సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్‌, ఆయన సతీమణి మధులిక పార్థివదేహాలను కామ్‌రాజ్‌ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్రార్‌ స్క్వేర్‌ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. 

అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది, 33 మంది ట్రైసర్వీస్‌ బ్యాండ్‌ ముందు వెళ్లనుంది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్‌ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించనుంది. సీడీఎస్‌ అంతిమ సంస్కారాల్లో మొత్తం 800 మంది సర్వీసు సిబ్బంది పాల్గొంటారు. అంత్యక్రియల సమయంలో గౌరవసూచికంగా 17 గన్‌ సెల్యూట్‌ నిర్వహించనున్నారు. అనంతరం రావత్‌కు తుదివీడ్కోలు పలకనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని