రాష్ట్రపతి ప్రత్యేక ఆహ్వానం.. మొఘల్‌ గార్డెన్స్‌ను సందర్శించిన సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేడు రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆహ్వానం మేరకు సీజేఐ

Updated : 19 Feb 2022 15:42 IST

దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేడు రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆహ్వానం మేరకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులతో కలిసి మొఘల్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. న్యాయమూర్తుల కుటుంబాలతో రాష్ట్రపతి దంపతులు ఆప్యాయంగా ముచ్చటించారు. వారికి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ.. సుప్రీంకోర్టు వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందజేశారు. 

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌లో ఏటా ఫిబ్రవరిలో ‘ఉద్యానోత్సవ్‌’ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులోని 11 రకాల తులిప్‌ పువ్వులు ఫిబ్రవరి నెలలో దశల వారీగా వికసిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఉద్యానోత్సవ్‌ను ఫిబ్రవరి 10న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు ప్రారంభించారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు సందర్శకులను అనుమతి చేస్తున్నారు. అయితే కొవిడ్‌ నిబంధనల మేరకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్నవారికి మాత్రమే గార్డెన్‌ను సందర్శించే వీలు ఉంటుందని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని