Rahul Gandhi: రాహుల్‌ గాంధీ ఇంటికి దిల్లీ పోలీసులు

‘స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌’ (శాంతి భద్రతలు) సాగర్‌ ప్రీత్‌ హూడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్‌ లేన్‌లో ఉన్న రాహుల్‌ నివాసానికి ఆదివారం ఉదయం చేరుకుంది.

Updated : 19 Mar 2023 13:49 IST

దిల్లీ: దిల్లీ పోలీసులు ఆదివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇంటికి చేరుకున్నారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై ఆయన నుంచి స్పష్టత తీసుకోవడానికి పోలీసులు ఈరోజు ఇంటికి చేరుకున్నారు.

‘స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌’ (శాంతి భద్రతలు) సాగర్‌ ప్రీత్‌ హూడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్‌ లేన్‌లో ఉన్న రాహుల్‌ నివాసానికి చేరుకుంది. సోషల్‌ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఆయనకు ఒక ప్రశ్నావళి పంపినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామంటూ ఆయన్ని సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. తద్వారా వారికి మరింత భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌లో మహిళల లైంగిక దాడుల అంశాన్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనని కొంతమంది మహిళలు కలిశారని.. ఇప్పటికీ తాము లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామని వాపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో అలా రాహుల్‌ను ఆశ్రయించినవారి జాబితాను తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని