Delhi: ‘జాతీయ గీతం పాడుతుంటే నిలబడరా?’

జాతీయ గేయానికి గౌరవం ఇవ్వని పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌నివాస్‌ గోయెల్ దిల్లీ ప్రధాన కార్యదర్శిని కోరారు. తాజాగా దిల్లీలో రెండ్రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. జాతీయగేయాన్ని ఆలపించారు. ఆ సమయంలో

Updated : 30 Jul 2021 23:00 IST

అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరిన దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌

దిల్లీ: జాతీయ గీతానికి గౌరవం ఇవ్వని పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌నివాస్‌ గోయెల్ దిల్లీ ప్రధాన కార్యదర్శిని కోరారు. తాజాగా దిల్లీలో రెండ్రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. జాతీయగీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో అసెంబ్లీలో పనిచేసే పలువురు అధికారులు నిలబడకపోవడాన్ని స్పీకర్‌ గమనించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ ద్వారా దిల్లీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆగస్టు 6లోపు ఆ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని