Corona fear: ఈ ఎ,బి,సి,డి పాటించండి: కేంద్రం

చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఎ,బి,సి,డిలకు సరికొత్త నిర్వచనాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎ అంటే యాపిల్‌, బి అంటే బాల్‌ కాకుండా వాటిని కరోనా నేపథ్యంలో మార్చింది......

Published : 13 Jul 2021 23:56 IST

ఆ వదంతులను నమ్మకండి

దిల్లీ: చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఎ,బి,సి,డిలకు సరికొత్త నిర్వచనాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎ అంటే యాపిల్‌, బి అంటే బాల్‌ కాకుండా వాటిని కరోనా నేపథ్యంలో మార్చింది. గతేడాది డిసెంబరు నెలలో డెల్టా వేరియంట్‌ తొలి కేసు నమోదు కాగా.. రెండో దశ విజృంభణలో ఈ వేరియంటే తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, లాంబ్డా.. అంటూ పుట్టుకొస్తున్న ఈ వైరస్‌ కొత్త రూపాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో అనవసర భయాలను సృష్టించే సమాచారాన్ని నమ్మొద్దు.. వాటిని ఎవరికీ పొంపొద్దని విజ్ఞప్తి చేస్తూ సమాచార ప్రసారాల శాఖ ఈ ఏబీసీడీ సూత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఏమిటీ ఎ, బి, సి, డి?

ఎ- అడ్వయిజ్‌: మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు అనధికార సమాచారాలను షేర్‌ చేయకండి

బి- బిలీవ్‌: ముఖ్యంగా ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌, డబ్ల్యూహెచ్‌ఓ ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మండి

సి- క్రాస్‌ చెక్: సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖతో పాటు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) అందించే కొవిడ్‌ సమాచార వివరాలు, వాటి గణాంకాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి

డి- డోన్ట్‌ ప్రమోట్‌ ఫియర్‌: కరోనా వైరస్‌ వేరియంట్‌లు, వాక్సిన్లకు సంబంధించి భయాందోళనలు రేకెత్తించే సందేశాలు పంపించొద్దు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని