Korean War: లాంఛనంగా కొరియా యుద్ధం ముగింపునకు సిద్ధం

చరిత్రలో అసంపూర్తిగా నిలిచిన  కొరియా యుద్ధం త్వరలో లాంఛనంగా ముగిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు

Published : 13 Dec 2021 18:21 IST

 వెల్లడించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: చరిత్రలో అసంపూర్తిగా నిలిచిన  కొరియా యుద్ధం త్వరలో లాంఛనంగా ముగిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ పేర్కొన్నారు. 1950-53 వరకు జరిగిన ఈ యుద్ధంలో కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే జరిగింది. కానీ.. ఇప్పటి వరకూ శాంతి ఒప్పందం కుదరలేదు. దీంతో సాంకేతికంగా ఉ.కొరియా, ద.కొరియా యుద్ధం ముగియనట్లే లెక్క. ఫలితంగా ఇప్పటికీ ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా దీనిపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అమెరికా, చైనా దేశాలు యుద్ధం ముగిసినట్లు ప్రకటించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయని తెలిపారు. కానీ.. దీనిపై పూర్తి స్థాయి చర్చలు మాత్రం మొదలు కాలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఉత్తరకొరియా డిమాండ్లే కారణమని ఆరోపించారు. అమెరికా ఆంక్షల తొలగింపు డిమాండ్‌పై ఉత్తరకొరియా పట్టుబట్టడం చర్చలకు అడ్డంకిగా మారిందని వెల్లడించారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మాట్లాడుతూ చర్చల పునరుద్ధరణకు సిద్ధమనే సంకేతాలిచ్చారు. కానీ, అమెరికా పాటించే ఉత్తరకొరియా విరుద్ధ విధానాలను విడనాడాలని పేర్కొన్నారు. అమెరికా దళాలు దక్షిణ కొరియాలో ఉండటాన్ని కూడా ఆమె వ్యతిరేకించారు. ఇక ఉ.కొరియా ఆయుధ కార్యక్రమంపై అమెరికా విధించిన ఆంక్షలను తొలుత తొలగించాలని పట్టుబట్టారు. 

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని