NIA: ఎన్‌ఐఏ నూతన అధిపతిగా పంజాబ్‌ మాజీ డీజీపీ దినకర్‌ గుప్త

కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) నూతన అధిపతిగా దినకర్‌ గుప్త నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయనను నియమకానికి  కేంద్ర హోంశాఖ ప్రతిపాదించడంతో కేబినెట్‌ నియామకాల కమిటీ  ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 

Updated : 24 Jun 2022 06:13 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) నూతన అధిపతిగా దినకర్‌ గుప్త నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయనను నియమకానికి  కేంద్ర హోంశాఖ ప్రతిపాదించడంతో కేబినెట్‌ నియామకాల కమిటీ  ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 1987 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన దినకర్‌ గుప్త 2024 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పటి వరకు ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగే అవకాశం ఉంది. గత మే నెలలో ఎన్‌ఐఏ అధిపతిగా ఉన్న వైసీ మోదీ పదవీ విరమణ చేయడంతో సీఆర్‌పీఎఫ్‌ డీజీగా ఉన్న ఐపీఎస్‌ అధికారి కుల్దీప్‌ సింగ్‌కు ఎన్‌ఐఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో పంజాబ్‌ డీజీపీగా విధులు నిర్వహించిన దినకర్‌ గుప్తను అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ గత అక్టోబర్‌లో ఆ పదవి నుంచి తప్పించారు. అనంతరం ఆయనకు పంజాబ్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించారు. 

మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వశాఖలో అంతర్గత భద్రత(internal Security) స్పెషల్‌ సెక్రటరీగా స్వాగత్‌ దాస్‌ నియమితులయ్యారు. ఈ హోదాలో స్వాగత్‌ దాస్‌ నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ  ఆమోదం తెలిపింది. 1987 బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన స్వాగత్‌ దాస్‌ ప్రస్తుతం ఇంటిలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డెరెక్టర్‌గా ఉన్నారు. 2024 నవంబర్‌ 30న ఈయన పదవీ విరమణ చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని