శ్రావ్యమైన అలారంతో నిద్ర లేస్తే హుషారు!

ఉదయాన్నే నిద్రలేచినప్పుడు చాలా బద్ధకంగా, నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే శ్రావ్యమైన సంగీతంతో కూడిన అలారం పెట్టుకొని, నిద్రలేస్తే ఆ భావనలు చాలా వరకూ తొలగిపోతాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. ఉదయాన్నే మనలో తలెత్తే అసౌకర్యం స్థాయి.. మనల్ని నిద్రలేపిన అలారం శబ్దం...

Published : 04 Feb 2020 00:00 IST

మెల్‌బోర్న్‌: ఉదయాన్నే నిద్రలేచినప్పుడు చాలా బద్ధకంగా, నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే శ్రావ్యమైన సంగీతంతో కూడిన అలారం పెట్టుకొని, నిద్రలేస్తే ఆ భావనలు చాలా వరకూ తొలగిపోతాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. ఉదయాన్నే మనలో తలెత్తే అసౌకర్యం స్థాయి.. మనల్ని నిద్రలేపిన అలారం శబ్దం తీరుతెన్నులపై ఆధారపడి  ఉంటుందని పేర్కొన్నారు. నిద్ర లేవగానే చురుగ్గా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్న షిఫ్ట్‌ కార్మికులు, అత్యవసర సేవల విభాగం వారికి ఈ పరిశోధన ప్రయోజనం కలిగిస్తుంది. భూ కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని వ్యోమగాములు కూడా ఉదయాన్నే తలెత్తే అసౌకర్యం.. తమ విధులపై ప్రభావం చూపుతోందని వాపోతున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. బీప్‌.. బీప్‌.. బీప్‌ వంటి కర్ణకఠోర శబ్దాల వల్ల మెదడు చర్యల్లో గందరగోళం చెలరేగడం కానీ అవి విచ్ఛిన్నం కావడం కానీ జరుగుతుందని తెలిపారు. ఫలితంగా.. నిద్రలేచే సమయంలో నలతగా అనిపిస్తుందన్నారు. మెలోడీతో కూడిన అలారం వల్ల అప్రమత్తత స్థాయి పెరుగుతుందని చెప్పారు. సరైన మూడ్‌తో నిద్ర లేవకుంటే ఆ తర్వాత నాలుగు గంటల పాటు మన పనితీరు మందగిస్తుందని చెప్పారు. అనేక ప్రమాదాలకు దీనితో సంబంధం ఉన్నట్లు తేలిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని