అమెరికాకు జోబిడెన్‌ అవసరం ఉంది: హారిస్‌

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. నవంబర్‌లో నిర్వహించనున్న ఎన్నికల్లో అధ్యక్ష రిపబ్లికన్‌ అభ్యర్థిగా ట్రంప్‌ మరోసారి పోటీ చేస్తున్నారు.

Published : 09 Mar 2020 01:23 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. నవంబర్‌లో నిర్వహించనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా ట్రంప్‌ మరోసారి పోటీ చేయనున్నారు. మరోవైపు ట్రంప్‌ను ఢీకొట్టేందుకు డెమోక్రటిక్‌ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపించారు. అందులో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు భారత సంతతి మహిళ, కాలిఫోర్నియా సెనేటర్‌ కమలా హారిస్‌ కూడా ఉన్నారు. అయితే, ఆర్థిక కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు కమల గత డిసెంబర్‌లోనే ప్రకటించారు. ఇంకా కొంతమంది పోటీలో ఉండటంతో డిమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థి ఎంపిక కోసం గత వారం క్రితం పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో 14రాష్ట్రాలు బిడెన్‌కే ఓటేశాయి. దీంతో అతనికి మార్గం సుగమమైంది.

తాజాగా.. బిడెన్‌కు మద్దతుగా ప్రకటిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో.. ‘అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు జోబిడెన్‌ అర్హుడు. నేను అతడిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. చాలాకాలంగా అతను నాకు పరిచయం ఉన్న వ్యక్తి. అమెరికా అతని సేవలు కోరుకుంటోందని. ప్రస్తుతం ప్రజలను పట్టించుకునే నాయకుడు దేశానికి అవసరం. అతను ప్రజలను ఏకం చేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడు. పోటీలో బిడెన్‌కు మద్దతుగా పనిచేసేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. అతడిని అమెరికా అధ్యక్షుడిగా చూసేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని ప్రకటించారు. దీంతో జో బిడెన్‌కు మరింత బలం చేకూరినట్లయింది. దీనిపై స్పందించిన బిడెన్‌ ‘ఒక దేశంగా మనం ఉత్తమంగా ఉండేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాం ఇది మనకు చాలా అవసరం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని