రాజ్యసభ సభ్యునిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి సమర్థించుకున్నారు. తన హాజరుతో న్యాయవ్యవస్థకు......

Updated : 21 Dec 2022 16:49 IST

దిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి సమర్థించుకున్నారు. తన హాజరుతో న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించే అవకాశం వచ్చినట్లు భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోగా.. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి పలు విమర్శలు వెళ్లువెత్తాయి. ప్రమాణస్వీకార సమయంలోనూ రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుల నుంచి ఆయన నిరసనలు ఎదురయ్యాయి. ఆయన ప్రమాణస్వీకారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని