కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీ

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్‌ కోవింద్‌ సమక్షంలో......

Published : 25 Apr 2020 15:34 IST

దిల్లీ: కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమక్షంలో కొఠారీ నేడు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) చీఫ్‌ పదవి గత జూన్‌ నుంచి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఓ ఉన్నతస్థాయి కమిటీ కొఠారీని సీవీసీ చీఫ్‌గా గత ఫిబ్రవరిలోనే సిఫార్సు చేసింది. కానీ, ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాప్యం జరిగింది.

కొఠారీ 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. హరియాణా కేడర్‌లో పనిచేసిన ఆయన 2016లో పదవి విరమణ పొందారు. అనంతరం పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(పీఈఎస్‌బీ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కార్యదర్శిగా వెళ్లారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని