24 గంటల్లో 1396 కొత్త కేసులు

దేశంలో గత 24 గంటల్లో 1,396 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. దీంతో కేసులు సంఖ్య 27,892కు చేరిందన్నారు. ఇందులో 20,835 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వ్యాధి నయమైన 381 మందిని ఆస్పత్రి నుంచి....

Published : 27 Apr 2020 16:53 IST

భారత్‌లో 27,892కు చేరిన కొవిడ్‌-19 కేసులు

16 జిల్లాల్లో 28 రోజుల్లో కొత్త కేసుల్లేవ్‌

దిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 1,396 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. దీంతో కేసుల సంఖ్య 27,892కు చేరిందన్నారు. ఇందులో 20,835 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వ్యాధి నయమైన 381 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని వెల్లడించారు. మొత్తంగా 6,184 మంది కోలుకోగా రికవరీ రేటు 22.17 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు.

గతంలో కొవిడ్‌-19 కేసులు నమోదైన 16 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గోండియా (మహారాష్ట్ర), దావణగిరె (కర్ణాటక), లఖి సరాయి (బిహార్‌) ఈ జాబితాలో చేరిన కొత్త జిల్లాలని ఆయన వెల్లడించారు. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు రాలేదని పేర్కొన్నారు. 

అవాస్తవాలు, భయం వ్యాపించకుండా జాగ్రత్తపడాలని అగర్వాల్‌ సూచించారు. కొవిడ్‌-19 వ్యాప్తికి ఒక వర్గమో, ప్రాంతమో కారణమనే ముద్ర పడకూదన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల లక్ష్యం కాకూడదని సూచించారు. విస్తృత ప్రచారం ద్వారా ప్రస్తుతం సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదన్నారు. నిజానికి ప్లాస్మా థెరపీలో ఉపయోగించే యాంటీ బాడీస్‌కు వారే అవసరమని లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు.

చదవండి: మూడో దశ? ఆ 25 మందికి ఎవర్నుంచి వైరస్‌ సోకింది?

చదవండి: కరోనా ప్రజ్వలన కేంద్రాల్లో లాక్‌డౌన్‌ పొడగింపు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని