ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.......

Published : 03 Jun 2020 11:41 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఒకరు కమాండర్‌ స్థాయి ఉగ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో జమ్మూకశ్మీర్‌ పోలీసులతో పాటు భారత సైనిక దళానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, 183 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌కు చెందిన బలగాలు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని