75 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి..!

ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వార్షిక సమావేశాలకు దేశాధినేతలు హాజరు కాబోరని అధ్యక్షుడు టిజానీ ముహమ్మద్‌ బండే తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోనే.....

Published : 09 Jun 2020 11:01 IST

న్యూయార్క్‌: ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వార్షిక సమావేశాలకు దేశాధినేతలు హాజరు కాబోరని అధ్యక్షుడు టిజానీ ముహమ్మద్‌ బండే తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 75 ఏళ్ల ఐరాస చరిత్రలో దేశాధినేతలు లేకుండా సభ నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ సభలో ఆయా దేశాధినేతలు ఎలా ప్రసంగించాలనే దానిపై రాబోయే రెండు వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. 

ఒకవేళ సభ నిర్వహిస్తే దేశాధినేతలతో పాటు వారి వెంట భారీ యంత్రాంగం రావాల్సి ఉంటుందని టిజానీ అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ గత నెల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఐరాస 75వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించే యోచనను విరమించుకోనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశాధినేతలు ముందే రికార్డు చేసిన సందేశాల్ని ఐరాసలోని తమ దౌత్యవేత్తల ద్వారా వినిపించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని