12వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో వరుసగా 12వ రోజు కూడా చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. గురువారం దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు భారం మోపాయి. దీంతో ఇవాళ దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరు రూ.77.81, డీజిల్‌

Published : 18 Jun 2020 08:49 IST

దిల్లీ: దేశంలో వరుసగా 12వ రోజు కూడా చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. గురువారం దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు భారం మోపాయి. దీంతో ఇవాళ దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరు రూ.77.81, డీజిల్‌ రూ.76.43కు చేరింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ  12 రోజుల్లోనే మొత్తంగా పెట్రోల్‌పై రూ.6.55, డీజిల్‌పై రూ.7.04 పైసలు మేరకు ధరలు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని