singapore: తగ్గిన సింగపూర్‌ జనాభా.. ఎన్నడూ ఇంతగా క్షీణించలేదు..

కొవిడ్‌ దెబ్బకు సింగపూర్‌ జనాభా తగ్గిపోయింది. 2020లో 56.90 లక్షలున్న జనాభా ఈ ఏడాది జూన్‌లో 54.50 లక్షలకు పడిపోయింది...

Updated : 29 Sep 2021 11:32 IST

సింగపూర్‌: కొవిడ్‌ దెబ్బకు సింగపూర్‌ జనాభా తగ్గిపోయింది. 2020లో 56.90 లక్షలున్న జనాభా ఈ ఏడాది జూన్‌లో 54.50 లక్షలకు పడిపోయింది. 1970లో ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించడం మొదలుపెట్టిన తరవాత ఎన్నడూ ఇంతగా జనాభా క్షీణించలేదు. చాలామంది సింగపూర్‌ పౌరులు, శాశ్వత నివాస హోదా (పీఆర్‌) గల విదేశీయులు పనుల మీద ఇతర దేశాలకు వెళ్లి, కొవిడ్‌ ఆంక్షల వల్ల తిరిగి రాలేక ఏడాది కాలంగా బయటే ఉండిపోవడం దీనికి మూల కారణం. సింగపూర్‌లో ఉన్నవారు కూడా.. కొవిడ్‌ నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు. దీనివల్ల కొత్తగా పౌరసత్వం కానీ, పీఆర్‌ హోదా కానీ పొందడం ఆలస్యమవుతోంది. వివిధ పనులు పనిచేయడానికి ఇతర దేశాల వారు సకాలంలో పర్మిట్లు పొందలేకపోతున్నారు. సింగపూర్‌ జనాభాలో రానురానూ వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే, జననాల రేటు తగ్గిపోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని