Russia: రష్యాలో కూలిన విమానం.. 19 మంది దుర్మరణం

రష్యాలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. తతర్‌స్థాన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన

Updated : 10 Oct 2021 17:09 IST

మాస్కో: రష్యాలో తేలికపాటి విమానం కూలిపోయింది. తతర్‌స్థాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 19 మంది మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. వీరిలో 19 మరణించగా.. ముగ్గురు గాయపడినట్లు సమాచారం.

రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన మెన్సెలిన్స్క్‌ పట్టణం సమీపంలో జరిగింది. ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. ‘‘ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. దీనిలో స్కైడైవర్లు ఉన్నారు. సహాయక బృందాలు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలను దర్యప్తు బృందం తెలుసుకొనే యత్నం చేస్తోంది’’ అని రష్యా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని