మహాత్ముడికి జాతి నివాళులు

జాతిపిత మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు.

Published : 31 Jan 2023 03:57 IST

దిల్లీ: జాతిపిత మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి నివాళులు అర్పించారు. ‘‘ఈ పుణ్య తిథి రోజున బాపును ప్రార్థిస్తూ.. ఆయన ఆలోచనలను స్మరించుకుంటున్నాను. దేశం కోసం పాటు పడ్డ అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగాలు ఎప్పటికి మర్చిపోలేనివి’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ త్యాగానికి గుర్తుగా ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని