అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపు

రామ జన్మభూమి ఆలయ సముదాయాన్ని బాంబుతో పేల్చేస్తానని ఓ వ్యక్తికి బెదిరింపు ఫోను వచ్చినట్లు అయోధ్య పోలీసులు గురువారం వెల్లడించారు.

Published : 03 Feb 2023 05:24 IST

నగరంలోని వ్యక్తికి ఫోన్‌ చేసి హెచ్చరిక

అయోధ్య: రామ జన్మభూమి ఆలయ సముదాయాన్ని బాంబుతో పేల్చేస్తానని ఓ వ్యక్తికి బెదిరింపు ఫోను వచ్చినట్లు అయోధ్య పోలీసులు గురువారం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. గురువారం ఉదయం 10 గంటలకు ఆలయ సముదాయాన్ని పేల్చేస్తానని బెదిరించాడు. మనోజ్‌ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో అప్రమత్తమైన సిబ్బంది జిల్లావ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు