దేశంలో ప్రజలే బాస్‌లు
న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలపై ఎలాంటి జాప్యం జరిగినా చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరిక చేసిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.
ప్రజాస్వామ్యంలో హెచ్చరికలు కుదరవు
సుప్రీం వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు స్పందన
ప్రయాగ్‌రాజ్: న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలపై ఎలాంటి జాప్యం జరిగినా చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరిక చేసిన నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాజ్యాంగం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశం నడుస్తుందని స్పష్టంచేశారు. ఎవరూ ఎవరికీ హెచ్చరికలు చేయలేరన్నారు. ‘‘దేశానికి ప్రజలే యజమానులు (మాలిక్). మేమంతా సేవకులం. సేవ చేయడానికే ఉన్నాం. రాజ్యాంగమే మాకు మార్గదర్శి’’ అని పేర్కొన్నారు. కొన్ని అంశాలపై దేశంలో చర్చలు జరుగుతుంటాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను వ్యక్తంచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. ‘‘బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఏదైనా మాట్లాడే ముందు.. అది దేశానికి ప్రయోజనం కలిగిస్తుందా లేదా అన్నది ఆలోచించుకోవాలి’’ అని తెలిపారు. శనివారం అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామక ప్రక్రియపై న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..