సంక్షిప్త వార్తలు(2)

కేంద్రం 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలయింది.

Updated : 06 Feb 2023 05:38 IST

నోట్లరద్దు తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌

దిల్లీ: కేంద్రం 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలయింది. నోట్లరద్దుపై తొలుత సుప్రీంను ఆశ్రయించిన 58 పిటిషన్‌దారులలో ఒకరైన ఎమ్‌ఎల్‌ శర్మ ఆదివారం ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పిన రాజ్యాంగ ధర్మాసనం తాను సమర్పించిన రాతపూర్వక వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ తీర్పును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.


క్వాడ్‌ను చైనా వ్యతిరేక సైనిక కూటమిగా మార్చాలి

చైనా దళాలు 2014 తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఆక్రమించిన భూభాగం నుంచి వైదొలిగేలా మన దేశం అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురావాలి. ‘క్వాడ్‌’ను చైనా వ్యతిరేక సైనిక కూటమిగా మార్చేలా సభ్య దేశాలను ఒప్పించాలి. చైనాతో కఠినంగా వ్యవహరించడానికి మోదీకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాలి.

సుబ్రమణ్యస్వామి


పిల్లలతో ఆడుకుంటే ఎన్నో ప్రయోజనాలు

తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆడుకోవడానికి తప్పనిసరిగా సమయం కేటాయించాలి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు ఆందోళన, కుంగుబాటు, దుందుడుకు స్వభావం, నిద్రలేమి లాంటి సమస్యలు ఎదురు కావు. మీకు, పిల్లలకు మధ్య అనుబంధం బలపడటంతోపాటు ఒత్తిడి దూరమవుతుంది. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు తమ భావోద్వేగాలను మీతో స్వేచ్ఛగా పంచుకొనే వాతావరణం ఏర్పడుతుంది.

యునిసెఫ్‌


జోడో యాత్ర విజయంతో కొత్త ఆశలు

ఆశాదీపాన్ని వెలిగించడం ఎంత కీలకమో, ఆ ఆశలను సజీవంగా ఉంచడం అంతకన్నా ముఖ్యం. భారత్‌ జోడో యాత్ర సాధించిన అపూర్వ విజయంతో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరిలో కొత్త ఆశలు చిగురించాయి. అవి నెరవేరే దిశగా దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత యువత మీద ఉంది.

యోగేంద్ర యాదవ్‌


శక్తిమంతమైన మహిళలను సహించలేరు

మహిళా సాధికారత గురించి చాలా మంది గొప్పగా మాట్లాడుతారు. కానీ శక్తిమంతమైన మహిళ వారికి కనిపిస్తే సహించలేరు. ఆమెను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తారు. నిజమైన పురుషులు మహిళల పట్ల అలా ప్రవర్తించరు.

కంగనా రనౌత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని