అయిదేళ్లకు ఒకసారివైద్యుల లైసెన్స్ పునరుద్ధరణ
వైద్యవృత్తి చేపట్టేందుకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌కి ఇచ్చే అనుమతిని ప్రతి అయిదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.
కొత్త నిబంధనలు జారీచేసిన ఎన్‌ఎంసీ
ఈనాడు, దిల్లీ: వైద్యవృత్తి చేపట్టేందుకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌కి ఇచ్చే అనుమతిని ప్రతి అయిదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ రెగ్యులేషన్-2023’పేరుతో ప్రకటన జారీచేసింది. దీని ప్రకారం వైద్యులు ప్రతి అయిదేళ్లకోసారి తమ అనుమతిని పునరుద్ధరించుకోవడం తప్పనిసరి. గడువు ముగియడానికి 3 నెలల ముందే ఆ పని చేసుకోవాలి. ఒకవేళ అలా వైద్యుడి నుంచి లైసెన్స్ పునరుద్ధరణ దరఖాస్తు రాకపోతే స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి వారి పేరు తొలగిస్తారు. వారిని ‘ఇన్‌యాక్టివ్’గా ప్రకటిస్తారు. అలాంటి వారు వైద్య వృత్తి చేపట్టడానికి వీల్లేదు. రాష్ట్ర జాబితాలో ఏదైనా మెడికల్ ప్రాక్టీషనర్ పేరుపక్కన ‘ఇన్‌యాక్టివ్’ అని ఉంటే జాతీయ జాబితాలోనూ అలాగే కనిపిస్తుంది. ఒక రాష్ట్ర వైద్య మండలిలో పేరు నమోదుచేసుకున్న వైద్యుడు మరో రాష్ట్రంలో వైద్య వృత్తిచేపట్టాలనుకుంటే.. ఆ రాష్ట్ర ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రాక్టీస్ లైసెన్స్‌ను బదిలీ చేసుకోవాలనుకుంటే అందుకోసం దరఖాస్తు చేసుకోవాలి. దాని బదిలీకి అభ్యంతరం లేకపోతే సంబంధిత రాష్ట్ర వైద్య మండలి 30రోజుల్లోపు దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ 30 రోజుల్లోపు అది నిర్ణయం వెలువరించకపోతే లైసెన్స్‌ను బదిలీ చేసినట్లుగానే భావించవచ్చు.
* లైసెన్స్ కోసం కానీ, పునరుద్ధరణ కోసం కానీ చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర వైద్య మండలి ఏదైనా కారణంతో తిరస్కరిస్తే సంబంధిత వ్యక్తి అపీల్ చేసుకోవచ్చు. ఇందుకు 30 రోజుల సమయం ఉంటుంది. దానిపై ఆ బోర్డు 30రోజుల్లోపు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. ఆ అపీల్‌ను ఎథిక్స్ బోర్డు స్వీకరిస్తే ఆ వైద్యుడికి లైసెన్స్ జారీచేయాలని ఆదేశిస్తుంది. దాన్ని రాష్ట్ర వైద్య మండళ్లు తప్పనిసరిగా అమలుచేసితీరాలి. 15 రోజుల్లోపు లైసెన్స్ మంజూరుచేయాలి.
* ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు మెడికల్ ప్రాక్టీషనర్ల జాతీయ రిజిష్టర్‌ను నిర్వహిస్తుంది. రాష్ట్ర జాబితాను సంబంధిత స్టేట్ మెడికల్ కౌన్సిళ్లు నిర్వహిస్తాయి.
* జాతీయ స్థాయిలో వైద్యుల జాబితాను సంబంధిత కమిషన్ వెబ్‌సైట్‌లో బహిరంగంగా ఉంచుతారు. అందులో మెడికల్ ప్రాక్టీషనర్‌కు సంబంధించిన నమోదు సంఖ్య, పేరు, తండ్రి పేరు, వైద్యునిగా నమోదు తేదీ, పనిచేసే చోటు, వైద్య విద్యార్హతలు, ప్రత్యేకత, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, విశ్వవిద్యాలయం వివరాలను ఎవరైనా చూసుకోవచ్చు.
* ఏ వైద్యుడు అయినా వైద్య వృత్తి చేపట్టాలంటే తొలుత ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డుకు వెబ్‌పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏ రాష్ట్రం/రాష్ట్రాల్లో ప్రాక్టీస్ చేయదలచుకున్నదీ అందులో చెప్పాలి. అందులో పేర్కొన్న వివరాలను పరిశీలించి రాష్ట్ర వైద్య మండలి సంతృప్తి చెందితే 30 రోజుల్లోపు లైసెన్స్ జారీచేస్తుంది. లేదంటే తిరస్కరిస్తుంది.
* రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం-2019 కింద గుర్తింపు పొందిన అదనపు అర్హతలు సాధించి, వాటిని రాష్ట్ర/జాతీయ పట్టికలో తన పేరు ఎదుట చేర్చాలనుకుంటే అందుకోసం రాష్ట్ర వైద్య మండలికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ అర్హతలను పరిశీలించిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం జారీచేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్