అసహజ లైంగిక వేధింపులు.. ఆ మంత్రిపై చర్యలు తీసుకోండి

అసహజ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లాల్‌చంద్‌ కటారుచక్‌పై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ సూచించారు.

Published : 02 Jun 2023 04:43 IST

పంజాబ్‌ సీఎంకు గవర్నర్‌ సూచన

చండీగఢ్‌: అసహజ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి లాల్‌చంద్‌ కటారుచక్‌పై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ సూచించారు. నీచమైన నేరానికి పాల్పడిన ఆయనకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. తనను మంత్రి లైంగికంగా వేధిస్తున్నారని గురుదాస్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో పంజాబ్‌ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని పోలీసుశాఖ నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. 2013-14లో ఫేస్‌బుక్‌ద్వారా కటారుచక్‌ బాధితుడికి పరిచయమయ్యారు. అప్పటి నుంచి లైంగికంగా వేధించడం ప్రారంభించారు. తనకు పలుకుబడి ఉందని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు. 2021 వరకూ ఇలా అసహజ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు. మొదట్లో తన వయసు తక్కువగా ఉండటంవల్ల ఇవన్నీ అర్థం చేసుకోలేకపోయానని బాధితుడు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు