అమిత్‌ షా విజ్ఞప్తికి సానుకూల స్పందన

లైసెన్సు లేని ఆయుధాలను అప్పగించమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది.

Published : 03 Jun 2023 05:26 IST

మణిపుర్‌లో 140కు పైగా ఆయుధాల అప్పగింత

ఇంఫాల్‌: లైసెన్సు లేని ఆయుధాలను అప్పగించమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. మణిపుర్‌లో శుక్రవారం ఉదయానికల్లా 140కు పైగా ఆయుధాలను అప్పగించారు. 4 రోజుల మణిపుర్‌ పర్యటనలో భాగంగా ఆఖరిరోజైన గురువారం షా.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయుధాలు అప్పగించాలని..లేకపోతే శుక్రవారం నుంచి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అప్పగించిన ఆయుధాల్లో సెల్ఫ్‌లోడింగ్‌ రైఫిల్స్‌, లైట్‌ మెషిన్‌ గన్స్‌, పిస్టల్స్‌, ఏకే.. ఇన్సాస్‌ రైఫిల్స్‌, స్టెన్‌గన్స్‌, గ్రనేడ్‌ లాంఛర్‌ ఉన్నాయి. మణిపుర్‌లో గత నెల 3న రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కోర్టు ఉత్తర్వుల తర్వాత జరిగిన ఓ ర్యాలీతో  జాతుల ఘర్షణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ హింసలో 80కు పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 37,450 మంది 272 సహాయ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉండగా అమిత్‌షా పర్యటన ముగిసిన మరుసటిరోజే మణిపుర్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని