ముంబయి చేరిన వాణిజ్యనౌక ఎంవీ కెమ్‌ ప్లూటో

ఆరేబియా సముద్రంలో డ్రోన్‌ దాడికి గురైన వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటో సోమవారం ముంబయి చేరింది.

Published : 26 Dec 2023 04:57 IST

దిల్లీ: ఆరేబియా సముద్రంలో డ్రోన్‌ దాడికి గురైన వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటో సోమవారం ముంబయి చేరింది. భారత నౌకాదళానికి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు దీన్ని క్షుణ్నంగా పరిశీలించారు. మరిన్ని వివరాలు రాబట్టడానికి తదుపరి ఫోరెన్సిక్‌, సాంకేతిక విశ్లేషణ చేపట్టాల్సి ఉందని నౌకాదళ అధికారులు తెలిపారు. షిప్‌లో గుర్తించిన శకలాలను బట్టి అది డ్రోన్‌ దాడేనని స్పష్టమవుతున్నట్లు వివరించారు. శనివారం పోర్‌బందర్‌కు 217 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ నౌకపై దాడి జరిగింది. అందులో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం, తీరరక్షణ దళం.. యుద్ధనౌకలు, నిఘా విమానాలను ఆ ప్రాంతంలో మోహరించాయి. నేవీ తరఫున మూడు యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని