కస్టడీ నుంచి ఆదేశాలివ్వకుండా కేజ్రీవాల్‌ను అడ్డుకోండి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేయకుండా ఆయన్ను నిలువరించాలంటూ దిల్లీ హైకోర్టులో మంగళవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

Published : 27 Mar 2024 04:21 IST

దిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్‌

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేయకుండా ఆయన్ను నిలువరించాలంటూ దిల్లీ హైకోర్టులో మంగళవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. కేజ్రీవాల్‌ వ్యవహారశైలి న్యాయసూత్రాలకు వ్యతిరేకమైందని, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తునకు విఘాతం కలిగించేదని పిటిషన్‌దారు సుర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు టైపిస్ట్‌ను, కంప్యూటర్‌, ప్రింటర్‌ను సమకూర్చకుండా ఈడీకి ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్‌ కోరారు. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ గత వారం ఆయన మరో పిల్‌ను దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని