China: ఎల్‌ఏసీ వివాదంపై మూడో పక్షం జోక్యం కోరలేదు..: భారత్‌

చైనాతో సరిహద్దు వివాదంలో రాజకీయంగా కానీ, దౌత్య పరంగా కానీ జోక్యం చేసుకోవాలని మూడోపక్షాన్ని కోరలేదని భారత్‌ తేల్చిచెప్పింది. భారత్‌ అసలు ఇటువంటి

Published : 09 Jan 2022 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాతో సరిహద్దు వివాదంలో రాజకీయంగా కానీ, దౌత్య పరంగా కానీ జోక్యం చేసుకోవాలని మూడోపక్షాన్ని కోరలేదని భారత్‌ తేల్చిచెప్పింది. భారత్‌ అసలు ఇటువంటి వాటికి పూర్తిగా వ్యతిరేకమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘మూడో పక్షం జోక్యానికి భారత్‌ వ్యతిరేకమని సంబంధిత వర్గాలకు వెల్లడించాము. ఈ విషయంలో భారత్‌ స్థిరమైన విధానం అవలంభిస్తోంది’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా వర్గాలతో స్థిరంగా చర్చలు జరుపుతున్నా.. విశ్వాస లోపం సమస్యగా మారిందన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఈ నెల 12వ తేదీ నుంచి భారత్‌-చైనా మధ్య సైనికాధికారుల స్థాయిలో 14విడత చర్చలు జరగనున్నాయి. 2020 ఏప్రిల్‌లో వివాదం మొదలైనప్పటి నుంచి పలు విడతలుగా జరిగిన చర్చలు కొంత మేరకు సఫలమై తూర్పు లద్ధాక్‌లోని కీలక ప్రాంతాల్లో దళాల ఉపసంహరణ జరిగింది.

భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశాలు కనిపించడంలేదు. 2020లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌లు చైనా మంత్రులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా రక్షణ మంత్రితో విడిగా భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్‌ ద్వైపాక్షిక చర్చల కోసం తొందరపడటం లేదని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని