
India-China: గోగ్రా నుంచి బలగాల ఉపసంహరణ షురూ.. తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేత
ఇంటర్నెట్ డెస్క్: తూర్పు లద్దాఖ్ గోగ్రా ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి సాధారణ పరిస్థితులు పునరుద్ధరిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతంలో బలగాల ఉపసంహరణకు భారత్, చైనా ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవులు, గల్వాన్ లోయ మినహా మిగతా నాలుగు ప్రాంతాల నుంచి ఇరుపక్షాల దళాలు వెనుదిరిగాయి. మరోవైపు డెప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్‌లో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.
ఏడాదిగా వివాదం..
తూర్పు లద్దాఖ్‌లో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైన్యాలను మొహరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇద్దరి మధ్య గతంలో పలుమార్లు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. తాజాగా జులై 31న మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం మొదలుపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.