DRDO: గురితప్పని ‘ప్రళయ్‌’

భారత్‌ మరో సరికొత్త క్షిపణిని పరీక్షించింది. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ‘ప్రళయ్‌’ క్షిపణిని నేడు రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది.

Updated : 22 Dec 2021 21:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ మరో సరికొత్త క్షిపణిని పరీక్షించింది. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ‘ప్రళయ్‌’ క్షిపణిని నేడు రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రమాణాలను ఈ క్షిపణి అందుకొంది. ఇది లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ డీఆర్‌డీవో ఒక ప్రకటన వెలువరించింది. క్షిపణికి సంబంధించి అన్ని సెన్సర్లు బాగా పనిచేసినట్లు వెల్లడించింది. దీనిలో ఘన ఇంధనం వినియోగించారు. ఈ క్షిపణి 150 కిమీ- 500 కిమీ మధ్య లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. మొబైల్‌ లాంఛర్‌పై క్షిపణి గమన నిర్దేశిత వ్యవస్థ సాయంతో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు డీఆర్‌డీవో పేర్కొంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.‘‘క్వాజీ బాలిస్టిక్‌ మిసైల్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని