కొత్తగా 2,529 కొవిడ్‌ కేసులు.. 21 కోట్ల మందికి ప్రికాషన్‌ డోస్‌

దేశంలో గడిచిన 24 గంటల్లో 1.22 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,529 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

Published : 06 Oct 2022 10:31 IST

దిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 1.22 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,529 కొవిడ్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.07 శాతం ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 3,533 మంది కోలుకోగా..  32,282  యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 218.84 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 94.88 కోట్ల మంది రెండో డోసు వేసుకోగా.. 21.47 కోట్ల మంది ప్రికాషన్‌ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొవిడ్‌ గణాంకాలు..

  • కొత్త కేసులు- 2,529
  • యాక్టివ్‌ కేసులు- 32,282 (0.07%)
  • రికవరీలు - 3,553
  • మొత్తం రికవరీలు - 4.40 కోట్లు (98.74%)
  • కొవిడ్‌ పరీక్షలు - 1,22,057
  • మొత్తం కొవిడ్‌ పరీక్షలు - 89.62 కోట్లు
  • గడిచిన 24 గంటల్లో వేసిన వ్యాక్సిన్‌ డోసులు- 79,366
  • మొత్తం డోసులు- 218.84 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని