Viral news: ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. రెప్పపాటులో మృత్యువుని గెలిచాడు

రెప్పపాటు కాలంలో ఓ యువకుడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. రోడ్డు క్రాస్‌ చేస్తుండగా.. ట్రక్కు ఢీ కొట్టబోగా డ్రైవర్‌ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.

Updated : 07 Jan 2023 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం. కానీ, భూమిపై నూకలు మిగిలుంటే ఎంత పెద్ద ప్రమాదం (Accident) నుంచైనా బయటపడొచ్చనడానికి ఇదే సంఘటనే నిదర్శనం. ఓ యువకుడు బైక్‌ (Bike) పై వేగంగా రోడ్‌ క్రాస్‌ చెయ్యబోతుండగా.. అటువైపుగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టబోయింది. కానీ, ట్రక్కు డ్రైవర్‌ అప్రమత్తతతో రెప్పపాటు కాలంలో యువకుడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. కానీ, ట్రక్కు మాత్రం బాగా దెబ్బతింది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వీడియోను దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత ఒళ్లు జల్దరిస్తుందనడం అతిశయోక్తి కాదు. యువకుడి తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ ట్రక్కు డ్రైవర్‌ అలర్ట్‌గా ఉండకపోతే అతడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తొందరగా ఇంటికి వెళ్లాలని ఉంటుంది కానీ, రోడ్డుపై ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా?అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వారి డ్రైవింగ్‌ లైసెన్సును వెంటనే రద్దు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని