Delhi Liquor Scam: మనీశ్ సిసోదియాకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియాకు (Sisodia) బెయిల్ మంజూరు చేసేందుకు రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిరాకరించింది.
దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మద్యం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోదియాకు జ్యుడీషియల్ కస్టడీని విధిస్తూ దిల్లీ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 24న విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 3 వరకు ఈ కస్టడీ కొనసాగనుంది. ఇప్పటికే నెల రోజులకు పైగా జైలులోనే ఉంటున్నందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సిసోదియా రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్ జైలుకు తరలించారు. ఆ కస్టడీ కూడా ముగియడంతో సిసోదియాను వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని, అందువల్ల ఆయనను మరికొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉంచాలని సీబీఐ (CBI) న్యాయస్థానాన్ని కోరింది. దీంతో సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..
-
Crime News
‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్